Tuesday, November 26, 2024

Burning Story – బ్లేజ్ వాడ‌లో కేశినేని మంట‌లు… టిడిపిలో సెగ‌లు..

విజ‌య‌వాడ – తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అథిష్టానంపై త‌న అస‌మ్మ‌తి గ‌ళాన్ని మ‌రింత పెంచారు… ఇటివ‌ల ఆయ‌న వైసిపి నేత‌ల‌తో,ఎమ్మెల్యేల‌తో చెట్టాప‌ట్టాలు వేసుకు తిరుగుతుండ‌టంలో, వారిని పొగ‌డ్త‌ల‌తో ముంచేత్త‌డంతో టిడిపిలోని స‌హ నేత‌లు కేశినేనిపై ఒంటికాలి మీద లేస్తున్నారు.. అలాగే నానీ కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గ‌తీ కొన్ని రోజులుగా ఆయన పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలే తన బలం అని… ఇంటిపెండెంట్ గా నిలబడినా గెలుస్తానని కేశినేని అన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా తనకు ఆహ్వానాలు వస్తున్నాయని… దీని అర్థం తాను మంచివాడిననే కదా అని అన్నారు. తాను చెడ్డవాడినైతే తనను ఆహ్వానించరు కదా అని చెప్పారు. ప్రజల కోసం అందరితో కలిసి పని చేయాల్సి ఉందని చెప్పారు. తాను విజయవాడ నియోజకవర్గం ఎంపీని మాత్రమేనని… టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని కేశినేని ఆ పార్టీతో తెగ‌తెంపులు చేసుకునో ధోర‌ణిలోనే మాట్లాడారు.. చివ‌ర‌కు . తాను పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదని, కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదని తేల్చేశారు… కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను గొట్టంగాడని, చెప్పుతో కొడతామని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారని,అయితే తాను ఏం మాట్లాడలేదని, ప్రజల కోసం తాను తన పని చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు.

ఇక ఇటీవల జరిగిన మహానాడుకు తనను పిలవలేదని , విజయవాడలో ఇటీవల ఒక టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారని, దానికి కూడా తనకు ఆహ్వానం లేదని చెప్పుకొచ్చారు.. సాక్షాత్తు టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్న విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికే త‌న‌ను పిలువ‌లేద‌ని,ఇది దేనికి సంకేతం అంటూ ప్ర‌శ్నించారు. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలను గొట్టంగాళ్లుగా అభివర్ణించారు. మొన్న అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు పీఏ ఫోన్ చేసి పిలిస్తేనే తను వెళ్లానని,లోపల అమిత్ షా, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారో కూడా తనకు తెలియదని అన్నారు. ఇది ఇలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనను పిలిస్తే వెళ్లి మాట్టాడతానని అంటూ తనంతట తాను పార్టీ అధ్యక్షుడి వద్ద కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.. ఈ కేశినేని తాజా వ్యాఖ్యాల‌పై జిల్లాలోని టిడిపి నేత‌లు మండిప‌డుతున్నారు.. ఇక నానీ తెలుగుదేశం పార్టీకి దూర‌మైన‌ట్లేన‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement