Tuesday, November 19, 2024

Bunni Utsav – నేటి అర్ధ‌రాత్రి దేవ‌ర‌గ‌ట్టు స‌మ‌రం – కొట్టేసుకుంటానికి సిద్ధంగా ఉన్న 9 గ్రామాల భ‌క్త జ‌నం

కర్నూలు బ్యూరో – ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఆచారాలు ప్రళవిడుతాయి.. ఎక్కడ అభివృద్ధి ఉంటుందో.. అక్కడ జ్యోతి ప్రజ్వరెళుతుందన్నది ఇలా చీకటి ఆచారాల్లో ఒకటి దేవరగట్టు ఆచారం..కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతం నిలయమైన… పశ్చిమ ప్రాంతంలోని ఓ కొండ గట్టు ప్రాంతం దేవరగట్టు.. ఈ కొండ చుట్టూ సుమారు 8 గ్రామాలు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి ఆచారాలు ఇక్కడ మిళితమై ఉన్నాయి.అందులో ఓ గ్రామమే దేవరగట్టు.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది కర్రల సమరం… అనాదిగా కొనసాగుతూ వస్తున్న ఆచార, సంప్రదాయాలకు ఇది నిదర్శనం. ఎంతో ఆసక్తి కరంగా, ఉత్కంఠగా సాగే దేవరగట్టు బన్ని ఉత్సవాలకు ఎప్పుడు మాదిరే ఈ ఏడాది కూడా సర్వం సిద్ధమైంది ….

దసరా అంటే చాలు విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ వింతైనా ఆచార వ్యవహారాలు అందులో ఉండే గ్రామాల కట్టుబాట్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది దేవరగట్టు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుందా మండలంలోని దేవరగట్టు బన్నీ ఉత్సవం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఒక్క కర్నూలు జిల్లానే కాదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతం ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసే రోజది.
మంగళవారం అర్ధరాత్రి జరిగే బన్నీ సమరానికి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.. ఇక మిగిలింది సమరమే.. ప్రతి ఏటా మాల్లమల్లేశ్వరుడి బన్నీ ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమర్రాన్ని అపడం ఎవరి తరం అయ్యేలా లేదు…. దేవరగట్టులో కొలువై ఉన్న మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఊరేగింపులో జరిగేదే కర్రల సమరం. తమ
దేవత మూర్తులను కాపాడుకునేందుకు ఒక వర్గం, దక్కించుకునేందుకు మరో వర్గం ఇలా ఈ కర్రల సమరంలో 3 గ్రామాలు, మరోవైపు 6 గ్రామలు అర్ధరాత్రి వేల దివిటిల వెలుగులలో జరుపుకునే మహా సంగ్రామం బన్నీ ఉత్సవాలు
బన్నీ ఉత్సవాలకు వచ్చే నేరనికి తాండా, నేరనికి, కొత్తపేట గ్రామాలు ఒక టీమ్, సులువాయి, విరుపాపురం, ఎల్లార్తి , హరికేర, బిలేహల్ , నెట్రవట్టి మరో టీమ్… వీరంతా ఒక చేతిలో దివిటీ పట్టుకొని కొండల్లో డోలు వాయిస్తూ డుర్ర్. ర్ పరాక్. .గో పరక్ …బహు పరాక్ అనే ఒక రకమైన శబ్దాలు చేస్తూ దేవరగట్టు చేరుకుంటారు . అలోగ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాలమల్లేశ్వర కళ్యాణం తంతు ముగుస్తుంది. ఇక కళ్యాణం తరువాత ఉత్సవ విగ్రహ హాలతో నెరినికి , నెరనికి తాండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు జైత్రయాత్ర బయలుదేరుతుంది.

ఈ జైత్ర యాత్ర సింహగట్టం చేరుకోగానే ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా పూనకం వచ్చిన వారిలా సులువాయి, విరుపాపురం, ఎల్లార్తి , హరికేర, బిలేహల్ , నెట్రవట్టి ప్రజలు ఊగి పోవడం.. దేవుడి కోసం కర్రలతో సమరం చేస్తారు. ఈ పోరులో సమరంలో కర్రల తో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందిచడం తరతరాలుగా వస్తున్న ఆచారం. దసరా పండుగ రోజు నిర్వహించే బన్నీ జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది.సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. ఈ సమరం ముగియగానే నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిస్తారు. అనంతరం మరుసటి దినం నెరణికి గ్రామ పురోహితులు స్వామివారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత గొరవయ్యల ఆటలు, నోటితో గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. అనంతరం మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

- Advertisement -

బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత.
దసరా పండుగ రోజైన అక్టోబర్ 24 వతేది మంగళవారం రాత్రి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఇప్పటికే ప్రకటించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందులో అడిషనల్ ఎస్పీ ఒకరు , 9 మంది డిఎస్పీలు, 29 మంది సిఐలు, 66 మంది ఎస్సైలు, 155 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 377 మంది కానిస్టేబుళ్ళు, 48 స్పెషల్ పార్టీ బృందాలు, 2 పట్లూన్ల ఎపిఎస్పీ బలగాలు, 185 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో పాల్గొంటారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది.
బన్ని ఉత్సవంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి సృష్టిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించడానికి 100 నైట్ విజన్ సిసి కెమెరాలు, 600 ఎల్ఈడి లైట్లు, డ్రోన్ కెమెరా, విడియో కెమెరాల ను వినియోగిస్తుండడం గమనార్హం.
బన్ని ఉత్సవంలో మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు కావడం వంటి దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల 15 (నెరణికి,కోత్తపేట, అరికెర, ఎల్లార్తి,) గ్రామాలలో పోలీసు రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. 10 గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నాటుసారా, కర్ణాటక లిక్కర్ ను ఇప్పటికే సిజ్ చేశారు. నాటుసారా విక్రయదారులు, కర్ణాటక లిక్కర్ అమ్మేవారి పై 15 కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంతకు మునుపు ఘర్షణల్లో పాల్పడ్డ వారిని, అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి 100 మందిని బైండోవర్ చేశారు. సెబ్ పోలీసులు కూడా దాడులు నిర్వహించి అరెస్టులు చేయడం జరిగింది. అక్రమ మద్యం అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. దేవరగట్టు చేరుకునే పరిసర గ్రామాల్లోనూ, ప్రధాన రహాదారుల్లోనే కాక చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఉత్సవంలో ఏలాంటి రక్త గాయాలు కాకుండా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. వీరితో పాటు బన్ని ఉత్సవంలో ఫైర్ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement