Friday, November 22, 2024

Sucide – బుక్కపట్నం సబ్ రిజిస్టార్ బలవన్మరణం

శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 25 (ప్రభన్యూస్) బుక్కపట్నం సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ నాయక్ (43) ఉరి వేసుకుని బలవన్మరణం పొందారు. ఈనెల 22న ఆయన ఏసీబీకి చిక్కిన విషయం విధితమే. పెనుకొండ మండలం గోనిపెంటకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఒక నిరుపేద కుటుంబం .ఉన్న కొద్దిపాటి పొలంతో తల్లిదండ్రులు వ్యవసాయంతో కుటుంబ జీవనం చేస్తూ కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నాడు. కుటుంబానికి తోబుట్టువుతో పాటు తాను ఒక్కడే కొడుకు. భార్య సుజాత పిల్లలు పవన్ తేజ్, హిమబిందులు ఇద్దరూ 10 ఏళ్లలోపు వయసు వారే. చిన్న కుటుంబంలో ఎన్నో కష్టనష్టాలను కన్నీళ్లను దిగమింగి ఎదిగిన కొడుకు. ఒక ఉన్నత ఉద్యోగంలో చేరటంతో వృద్ధాప్యంలో ఉద్ధరిస్తాడని తల్లిదండ్రులు కొండంత ఆశతో కలలు కంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం విధి నిర్వహణలో దొర్లిన తప్పిదంతో అవమానం భారంగా భావించి ఊరొదిలి వెళ్లాల్సి వచ్చింది.

పేదరికంతో పోరాడి, ఉన్నత ఉద్యోగం సాధించి, సమాజంలో గౌరవ మన్ననలు పొందే సమయంలో తలదించుకొనేలా ఊహించని పరిణామం ఎదురవటం తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఏసీబీకి చిక్కినాయన జీవితం పై విరక్తితో అక్కడి నుంచి తప్పించుకుని చెన్నైకి చేరుకున్నారు. అక్కడ మాధవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలో బస చేసి, లాడ్జి గదిలో దిగాడు. అఘాయిత్యానికి ఎప్పుడు పాల్పడ్డారో నిర్దిష్టమైన సమాచారాలు లేవు. అయితే సబ్ రిజిస్టార్ శ్రీనివాస్ నాయక్ చెన్నైలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్లు శనివారం రాత్రి బుక్కపట్నం పోలీసులకు సమాచారం అందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement