Thursday, November 7, 2024

AP : మసీదులు కట్టిందే నేను.. కూల్చనిస్తానా?.. చంద్ర‌బాబు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి): ‘‘ఎన్డీయే పాలనలో ఏనాడు ముస్లింల‌కు అన్యాయం జరగలేదు. ఇకపై కూడా అన్యాయం జరగదని, సీఏఏ, ఎన్ ఆర్ సీ చట్టానికి మద్దతు ఎవరు ఇచ్చారు. ఇక్కడి నక్కల జిత్తు ఏటూ సంతకం చేశారా? లేదా? ఎంపీగా గెలిస్తే ఎవరికి ఓటు వేస్తారు? బీజేపీకే ఓటు వేస్తారు. మీ కేసుల కోసం ముస్లింల‌ను మోసం చేస్తారా?’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులో ఆదివారం ముస్లింల‌తో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్డీయే ప్రభుత్వం ముస్లింల‌కు 4 శాతం రిజర్వేషన్ రద్దు చేస్తుంది.. మసీదులు కూల్చుతుందని వీళ్లు ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి రిజర్వేషన్ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది.. కానీ ఈ ఎన్నికల్లో ఇక్కడి వైసీపీ ఎంపీ గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారని’’ చంద్రబాబు ప్రశ్నించారు. అయిదేళ్లు తమ ప్రభుత్వం ఆదాయాన్ని సృష్టిస్తే .. జగన్ వచ్చి బటన్ నొక్కాడు. ఈ బటన్ నొక్కటానికి ఈయనే కావాలా? అని బాబు ప్రశ్నించారు. ‘‘వైసీపీలో న్యాయం జరిగిందా? టీడీపీలో న్యాయం జరిగిందా? లేదా?ప్రజల కోసం పాలించాలి. దోపిడీ కోసం మోసం చేస్తే పాలన కొనసాగదు. ఎన్డీయే ఉన్నా అన్యాయం జరగలేదు. ముస్లింలకు ఫైనాన్స్ .. ఉర్దు వర్సిటీ పెట్టించి. హాజ్ హౌస్ కట్టించాం. కడప, విజయవాడలో హాజ్ హౌస్ లు కట్టించాం. 8 కోట్లతో షాదీ హౌస్ కట్టించాం. 20 వేల ముస్లింల‌కు ఆధునిక మందిరాన్ని కట్టించాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇచ్చేది రూ.10.. దోచేది. రూ.100
‘‘ఉర్దూను రెండో భాష చేశాం. విదేశీ విద్య తీసుకు వచ్చాం. పేదలు ఎక్కువ మంది ఉన్నారని ప్రత్యేక శ్రద్ధ చూపించాం . ఖర్చులు పెరిగాయా? లేదా అని ” చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, కరెంటు చార్జీలు పెరిగాయని, మద్యం పేదల రక్తం పీల్చే కల్తీ మద్యం తీసుకు వచ్చారని ఆరోపించారు. పెన్నా నదిలో ఇసుక దొరుకుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏంటీ అరాచకం, సైకో మాత్రమే బాగుండాలన్నదే జగన్ సిద్ధాంతం అని చంద్రబాబు విమర్శించారు. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని, 527 మందిని విదేశాలకు పంపించామని తెలిపారు. 10 వేల రూ.3లక్షల రుణం, లక్ష సబ్సిడీ.. ఇమాములకు గౌరవ వేతనం ఇవ్వలేదన్నారు. రొట్టెల పండుగ రాష్ట్ర స్థాయి పండుగ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో దాడులపై పెరిగాయని, 50 మంది ముస్లింలపై దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల అబ్దుల్ సలాం దారుణంగా చంపారని, దొంగ దొంగ అనే నిందతో నలుగురు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఈ కూటమి నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement