Monday, November 25, 2024

కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి బుగ్గ‌న‌

డోన్ పట్టణంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణమలో “కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్” ను, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రారంభించారు. రెండు కోట్లతో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ల్యాబ్ లను ఆవిష్కరించారు. అనంతరం కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ భవనంలోని పైలాన్ ఆవిష్కరణ, కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ఆటోమొబైల్, మెకానికల్, వెల్డింగ్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, సివిల్, సీఎన్ సీ, డైకిన్ ల్యాబ్ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సమూన్ తో పాటు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, కియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ , డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్లు కొట్రికే హరికిషన్ , జాకీర్ , జడ్పిటిసి రాజకుమార్, నంద్యాల జిల్లా బీసీ అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ , నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ , పట్టణ యూత్ అధ్యక్షుడు రాజవర్ధన్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు , ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోస్ద్ కుమార్, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నవ్య, డోన్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బద్రీనాథ్, తహసీల్దార్ విద్యాసాగర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ తైజిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement