Monday, November 25, 2024

మార్చి 7 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. 3 రాజధానులు, కొత్త జిల్లాల బిల్లులకు ఆమోద ముద్ర?

ఏపీ​లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం తొలిసారిగా పూర్తిస్థాయిలో శాసన సభ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌- బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడుపుకొచ్చారు. అయితే ఈ సారి పూర్తి స్థాయిలో ఎక్కువ రోజులు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే కీలకమైన మూడు రాజ ధానులు, కొత్త జిల్లాల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మార్చి మొదటి వా రంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తేదీలను ఖరారు చేయనున్నారు.

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 7వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు- విశ్వసనీయవర్గాల సమాచారం. తొలుత మార్చి 4 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయని వార్తలు వచ్చాయి. అయితే మార్చి మొదటి వారంలో మహా శివరాత్రి పర్వదినం రావడంతో రెండో వారానికి వాయిదా వేసినట్లు- చెబుతున్నారు. ఈ సమావేశాలను 12 నుంచి 18 పనిదినాలు ఉండేలా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరంజరిగే బీఏసీ సమావేశంలో సభా నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మార్చి 7న తొలిరోజు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి, మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు. అలాగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అకాల మృతిపట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తిరిగి మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. ఈ దఫా బడ్జెట్‌ సమావేశాలు 12 నుంచి 18 రోజుల పాటు జరుగనున్నాయి.

11 లేదా 14న అసెంబ్లీకి బడ్జెట్‌?
మార్చి 11 లేదా 14న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఇప్పటికే శాఖల వారీగా ఆర్దిక మంత్రి బుగ్గన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. త్వరలో సీఎం జగన్‌ తన మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటికే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెట్టిన సీఎం జగన్‌ ఇక, ఈ సమావేశాల్లో కీలక బిల్లుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు- తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలకమైన మూడు రాజధానుల బిల్లులను ఉభయ సభల్లోనూ ఉప సంహరించుకుంది. అయితే, అదే సమయంలో మూడు రాజధానుల బిల్లులను మరింత సమగ్రంగా తిరిగి సభ ముందుకు తీసుకొస్తామంటూ సీఎం జగన్‌ అప్పుడే సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా… మూడు రాజధానుల బిల్లులను సిద్దం చేస్తున్నట్లు- విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పూర్త యితే, ఇక, సీఎం జగన్‌ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే కొత్త జిల్లాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఈ సమావేశాల్లో ఆమోద ముద్ర పడనుంది. మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశాల్లో శాఖల వారీగా వెల్లడించనున్నారు. ఇందుకు సంభందించి ఇప్పటికే ఆయా మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు సిద్ధం చేశారు. ఈ సమావేశాల ద్వారా రానున్న రెండేళ్ల భవిష్యత్‌ ప్రణా ళికలను సీఎం జగన్‌ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉన్నట్లు- తెలుస్తోంది. ఇదిలావుంటే, పాలనాపరంగా పలు కీలక నిర్ణ యాలకు ఈసారి సమావేశాలు కీలకం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement