Sunday, November 24, 2024

AP | వైసీపీ నేతలకు బుద్ధా వెంకన్న సవాల్…

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : అధికారం ఉందనే గర్వం, మదమెక్కిన బలుపుతో నాడు వెర్రవీగి చంద్రబాబు, లోకేశులపై అసభ్య పదజాలంతో మాట్లాడిన వల్లభనేని వంశీ కొడాలి నానిలు ఎక్కడున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడి నేడు పిరికిపందల్లా పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తున్న ఉన్నామని చెప్పారు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాలని ఎవరేంటో తేల్చుకుందాం రండి అంటూ ఆయన సవాల్ విసిరారు.

పశ్చిమ నియోజకవర్గం లోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా పిరికిపందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లు అధ్యక్ష, కార్యదర్శి లు గా వ్యవహరిస్తున్నట్లు వ్యంగ్యంగా మాట్లాడారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులని, గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణం అన్నారు. వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని, నిజంగా మనిషి అనే వాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అనే ప్రశ్నించారు.

చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేని వెధవలు కూడా వాగుతున్నారని, మాలాగా ఒక పార్టీ, ఒక నాయకుడు అనే కమిట్ మెంట్ తో పని చేసే నైజం వారికి లేదన్నారు. వారి నోటిదూల చూసిన ప్రజలంతా చట్టప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పు అయిపోయిందని బతిమాలుకుంటున్నట్లు చెబుతున్నారన్నరు.

- Advertisement -

అసలు కొడాలి నాని, వంశీ అడ్రెస్ ఏది. ఎక్కడ ఉన్నారని, చంపేస్తాం, పొడిచేస్తాం అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. మీలాగా అధికారం ఉంటే వాగటం, అధికారం పోతే పారిపోయే తత్త్వం మాది కాదని ఎప్పుడైనా నిజాయితీగా నిలబడతామన్నారు.

గత ఐదేళ్లుగా మీ అరాచకాలను ధైర్యంగా అడ్డుకుని పోరాటం చేశాం అని మీలాంటి వెధవలను చూసి పోసాని కృష్ణమురళీ కూడా అడ్డగోలుగా వాగాడని, ఉచ్చనీచాలు మరచి మాట్లాడిన మాటలకు శిక్ష అనుభవించాల్సిందే నన్నారు. ఇప్పుడు రాజకీయాలు వదిలేశానంటే.

చేసిన తప్పులు పోతాయా,చంద్రబాబు, పవన్ , బ్రాహ్మణి, ఆడవాళ్లను తిట్టిన మాటలు ఎక్కడకి పోతాయన్నారు. మేము ఎప్పుడైనా భారతిరెడ్డి గురించి మాట్లాడామా అన్న ఆయన, వంశీ, పోసాని, కొడాలి నాని , దేవినేని అవినాష్ లు క్షమాపణకు అర్హులు కాదన్నారు.

మీలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే.. మరోసారి ఇలా మాట్లాడకుండా ఉంటారను, మీరు ఇన్ని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు ఏమయ్యాయి నోళ్లు అంటూ ప్రశ్నించారు.

మా నాయకుడు సంస్కారం నేర్పారు కాబట్టి.. రాజకీయ విమర్శలకే మేము పరిమితం అన్న ఆయనమొన్నటి వరకు విర్రవీగిన వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదన్నారు. అంతర్జాతీయ స్కాం కు పాల్పడిన జగన్ శిక్ష అనుభవించక తప్పదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement