Friday, November 22, 2024

Ugadi: ప్ర‌సంగంలో త‌డ‌బ‌డ్డ జ‌గ‌న్‌.. స‌రిగ్గా మాట్లాడ‌లేరా? అంటూ బుద్ధా కామెంట్

తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగని పుర‌స్క‌రించుకుని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మైక్ అందుకున్న జ‌గ‌న్.. ఉగాది అనే ప‌దాన్ని ప‌లికే సంద‌ర్భంగా త‌డ‌బ‌డ‌డ్డారు. “ఉబా ఉబా ఉబాది అంటూ ఆయ‌న ప‌లికారు. ఈ వ్యాఖ్య‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న.. జ‌గ‌న్ మాట్లాడిన వీడియోను క‌ట్ చేసి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందరికీ “ఉబా ఉబా ఉబాది’’ శుభాకాంక్షలు అంట. ఒక్క ప‌దం కూడా స‌రిగ్గా మాట్లాడ‌లేరా? అని బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement