Tuesday, November 19, 2024

చంద్రబాబుపై పోలీస్ సంఘం నాయకుల ప్రకటనలు దారుణం.. బుద్ధ వెంకన్న ..

విజయవాడ ప్రభ న్యూస్. – చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసిన పోలీసులు సంఘం వైసిపి పోలీస్ అధికారుల సంఘం గా మారిపోయిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఘాటుగా విమర్శించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాతూ పుంగనూరులో చంద్రబాబుపై దాడి చేసిన వైసిపి నాయకులు కొత్త పల్లవి ప్రారంభించారని, పోలీసులు అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, ఎస్ పి రిషాంత్ రెడ్డి కలిసి చంద్రబాబును అడుగు అడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం నాయకులు ఏకపక్షంగా విమర్శలు చేయడం సరైనది కాదని వెంకన్న విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగతంగా పోలీస్ అధికారుల సంఘం నాయకులు మాట్లాడటం తగదని అన్నారు.

చంద్రబాబు సభను పోలీసులు తప్పు పడుతూ అడ్డుకోవడం సరైనది కాదని విమర్శించారు. పోలీసులను లా అండ్ ఆర్డర్కి కాకుండా టిడిపి నాయకులు, కార్యకర్తలపై కేసులకు ,దాడులకు ఉపయోగిస్తుంటే పోలీస్ అధికారుల సంఘం నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల జీతాలు , భత్యాల్లో కోతలు వేస్తే ఈ నాయకులేం చేస్తున్నారని, సీఎం జగన్ ను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఘాటుగా విమర్శించారు. పక్కా వైసీపీ సంఘం నాయకుల లాగా పోలీసు సంఘం నాయకులు మాట్లాడటం సరైనది కాదని బుద్ధ వెంకన్న విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వెంకన్న విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం వల్ల ఒక దళిత సిఐ ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ అధికారుల సంఘం నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement