Saturday, November 23, 2024

Vijayawada | అవినీతి చేస్తే ఊరుకోవాలా….

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : సిఐడి జప్తు చేసిన ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, పార్టీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జోగి రమేష్ కొడుకు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా,తప్పు చేశాడు కాబట్టి అరెస్టు చేశారన్నారు.

దీనిపై రాద్ధాంతం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెస్ చదివిన అతను అక్రమాస్తులు కొనుగోలు చేయాలా అంటూ ప్రశ్నించారు. తన కొడుకు అరెస్టుకు కులం రంగు పులుముతున్న జోగి రమేష్ అధికారంలో ఉండగా ఎంతమంది గౌడ్ విద్యార్థులకు సహాయం చేశాడో చెప్పాలన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకే నాడు జగన్ మంత్రి పదవి ఇచ్చాడని గుర్తు చేశారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేసినందుకే ఏసీబీ జోగి రమేష్ కొడుకును అరెస్టు చేసిందన్నారు.

జప్తు చేసిన ఆస్తులను ఎవరైనా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. జోగి రమేష్ మాత్రం వెనుకబడిన కులానికి చెందిన నాయకుడి పై కక్ష సాధింపు అని మాట్లాడడం తగదన్నారు. అధికారంలో ఉండగా ఎంతమంది గౌడ్ కులస్తులకి సహాయం చేశావో చెప్పాలన్నారు.

బాబు ఇంటి పైకి దాడికి వచ్చి, దౌర్జన్యం చేసినందుకే నీకు మంత్రి పదవి వచ్చిందన్నారు. చంద్రబాబు కక్ష సాధించే స్థాయి వ్యక్తివి నీవు ఏ మాత్రం కాదన్నారు. అవినీతి చేస్తే ఊరుకోవాలా.. అరెస్టు చేయకుండా వదిలేయాలా అని ప్రశ్నించారు.

- Advertisement -

అవినీతి కేసులో కూరుకుపోయి కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ మిమ్మల్ని బస్మాసురుల తయారు చేసినందుకే మీ పాపాలు పండాయని, అందుకే ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. నాడు బీసీ పిల్లాడిని పెట్రోల్ పోసి చంపిస్తే అప్పుడు నీకు కలం గుర్తు రాలేదా, కనీసం ఖండించావా అన్నారు.

కులానికి గౌరవం తెచ్చిన బలహీనవర్గ నాయకులు అందరూ తెదేపాలో ఉన్నారన్నారు. జోగి రమేష్ నువ్వు కులం గౌరవాన్ని పాడు చేస్తున్నావని, తప్పులు చేస్తూ కులాన్ని అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. అసలు చంద్రబాబుకు నీ గురించి ఆలోచన చేసే సమయమే లేదన్న ఆయన ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఆయన ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement