విజయవాడ : బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను పూర్తి అయ్యాయి.. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, గండి పూడ్చవేత నిపుణులు, ఇతర సిబ్బంది కలసి దిగ్విజయంగా మూడో గండిని కొద్ది సేపటిక్రితం పూడ్చివేశారు.. దీంతో విజయవాడలోకి ప్రవేశిస్తున్న వరద నీరుకు అడ్డుకట్టపడింది… . ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అ గాబీయన్ బాస్కెట్ విధానంలో పూర్తి చేశారు..
గాబీయన్ బాస్కెట్ విధానం అంటే ఇనుప జాలీల్లో రాళ్ళను నింపి గండి పూడ్చివేత విధానమే అని అధికారులు వెల్లడించారు. ఒక్కొక్కొ బాస్కెట్ 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో నింపి గండికి అడ్డుకట్టగా వేశారు.. 100 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్లు శుక్రవారమే అధికారులు పూడ్చారు. ఇవాళ మిగతా 60 మీటర్లు పూడ్చివేసి వరద నీటిని అడ్డుకున్నారు.. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది పాల్గొని బుడమేరు గండ్లను పూడ్చివేశారు..