అమరావతి, సెప్టెంబర్ 7: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. ఆర్మీ సారథ్యం లో రాత్రి వేళ కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందన్నారు.
మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించాురు