Wednesday, November 20, 2024

ఆమీర్ పేట్ గ్రామంలో బీటీ రోడ్డా సీసీ రోడ్డా..

మహేశ్వరం, (ప్రభ న్యూస్): గ్రామంలో రోడ్డు దీర్ఘ కాలంగా ఉండాలంటే బీటీ కి బదులు సీసీ రోడ్డును వేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఆదివారం నగరంలోని మంత్రి నివాసంలో ఆమీర్ పేట్ గ్రామ ఉప సర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్, అమీర్ పేట్ టీఆర్ఎస్ గ్రామ అద్యక్షుడు పెంటల వెంకటేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెంటల రాయప్ప కలిసి వినతి పత్రం ఇవ్వడం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇటీవల గ్రామంలో బీటి రోడ్డు మజూరు అయిన విషయం తెలిసిందే. కాగా అమీర్ పేట్ నుంచి మాణిక్యమ్మ గూడ వెళ్లే రోడ్డు గ్రామ చివరి వరకు 22న్నర ఫీట్ల సీ సీ రోడ్డును వేయించాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు మల్లేష్, ఎం. బాలరాజు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement