గూడూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో యువకుడు ఆదివారం దారుణహత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు యువకుడి గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తోంది. గూడూరుకు చెందిన రవి అనే యువకుడిని కత్తులతో దాడి చేసి దుండగులు చంపివేశారు. అక్రమ సంబంధమే ఇందుకు కారణమై ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూజ్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement