ఆముదాలవలస, డిసెంబర్ 16(ఆంధ్రప్రభ) : ఆముదాల వలస మండలంలోని గాజుల కొల్లివలస ఆర్ ఆర్ కాలనీకి చెందిన దామోదర పద్మ (35) అనే మహిళను దారుణంగా హత్య చేసి దుండగుడు పరారయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన సోండి సురేష్ కత్తితో మహిళ ఛాతీలో పొడిచి హత్య చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోయాడు.
ఈ మహిళ హత్యకు కారణం వివాహేతర సంబంధమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ఆమదాలవలస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -