చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో రెండేళ్ల క్రితం జరిగిన తల్లి కూతుళ్లను హత్య చేసి, ఆపై వారి మైనర్ కూతుర్ని మానభంగం చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు అదనపు జిల్లా న్యాయమూర్తి రమేష్ ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు.
పోలీసుల కథనం మేరకు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సరళమ్మ తో అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఆమెను హత్య చేసాడు.. ఆ విషయం తెలిసి నిలదీసిన సరళమ్మ తల్లి గంగులమ్మను కూడా హత్య చేసాడు. అంతటితో ఆగకుండా గంగులమ్మ మనవరాలు, సరళ కూతురు అయిన మైనర్ బాలికను మాన భంగం చేసాడు. 2021లో జరిగిన ఆ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న తంబళ్ళ పల్లె పోలీసులు మౌలాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ కేసును విచారించిన చిత్తూరు అదనపు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రమేష్ మంగళవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు విధించారు. కేసును గవర్నమెంట్ తరఫున ఏపీపీ లోకనాథరెడ్డి వాదించారు.