నంద్యాల బ్యూరో …. రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన దారుణ సంఘటన వెలుగు చూసింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమను కాదన్నందుకు లహరి అనే 17 సంవత్సరాల బాలికపై నోట్లోబట్టలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించినట్లు సమాచారం.
బాలికపై పెట్రోల్ పోసిన అనంతరం తనకు తాను పెట్రోల్ పోసుకొని నిప్పు అట్టించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
యువకుడు పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలించారు. వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర నందికొట్కూరు లోని ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి ని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీనికి అమ్మాయి అంగీకరించకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాల బాలికలు ప్రేమ అనే అపరిపక్వ ఆలోచనల వల్ల ఇలాంటి హత్య ఆత్మ హత్య లకు దారి తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రాధమిక విద్యావిధానాలు బాల బాలికలకు సామాజిక అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు
..