Wednesday, January 15, 2025

Chirala : గుండెపోటుతో అన్నదమ్ములు మృతి..

గుండెపోటుతో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ ఘటన స్థానిక గొల్లపాలెంలో జరిగింది. గొల్లపాలేనికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరైన గంగాధర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

అయితే అన్నతో పాటు ఆస్పత్రికి తమ్ముడు గోపి కూడా వెళ్లారు. ఆస్పతికి వెళ్లే సరికి అన్న గంగాధర్ మృతిచెందారు. దీంతో అన్న గంగాధర్ మృతి వివరాలు చెబుతుండగా తమ్ముడు గోపికి కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించగా గోపి కూడా మృతి చెందారు. అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందడంతో చీరాల గొల్లపాలెంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. చావులోనూ అన్న గంగాధర్‌ను తమ్ముడు గోపి వదిలిపెట్టలేదని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement