ముత్తుకూరు, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయంపైన జిల్లా ఏసీబీ డీఎస్పీ శిరీష పూర్తి వివరాలు మీడియాకు తెలిపారు. ఇవాళ ఏసీబీ అధికారులు ఈ కార్యాలయంపై దాడి చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు.
పంటపాళెం గ్రామానికి చెందిన ఓ రైతు తన తల్లి కాంతమ్మ పొలానికి సంబంధించి నోషనల్ నెంబర్ తొలగించి ఖాతా నెంబర్ వేసి రికార్డు సరిచేయాలని తహసీల్దార్ కు విన్నవించగా, ఆయన రూ.25వేలు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బాధితులు కార్యాలయంలో తహసీల్దార్ కు లంచం ఇస్తుండగా ఏసీబీ పట్టుకుందని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత రిమాండ్ కు తరలిస్తామని డీఎస్పీ చెప్పారు.
- Advertisement -