నెల్లూరు జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో సోమశిల ఒకటి. అయితే ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో పెన్నాకు నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. కాగా, సోమశిల జలాశయం డ్యాం దెబ్బతిందని, జలాశయం తెగిపోయే ప్రమాదం ఉందని కొంతమంది పుకార్లు సృష్టిస్తున్నారు.
ఇట్లాంటి వార్తలు నిరాధారమైనవని, ఎవరూ నమ్మవద్దని సోమశిల ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. అట్లాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోమశిల జలాశయానికి ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని, ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని ఎస్ై సుభాని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..