Tuesday, November 26, 2024

Breaking: తిరుప‌తికి జ‌ల‌గండం.. విమాన సర్వీసులకు అంతరాయం..

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కుండపోత వాన‌లు కురుస్తున్నాయి. కాగా, రేణిగుంట ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెద‌ర్‌ అనుకూలించక పోవడంతో… విమానాలు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాయి.

ఈ రోజు (గురువారం) తిరుప‌తిలో దిగాల్సిన ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుపతి నగరం జలమయమైంది.

తిరుమ‌ల‌లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. స్వామివారి ఆల‌యం ముందు భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచింది. తిరుప‌తిలోని లోతట్టు ప్రాంతాలు చాలామంటుకు జలమయం అయ్యాయి. రోడ్ల‌న్నీ నీటితో నిండిపోయి చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో వాహ‌నాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు తిరుమల కనుమదారిలోని కొండ చరియలు (Land slides) విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. భారీ వర్షం కారణంగా అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని కూడా టీడీడీ (TTD) మూసివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement