Wednesday, October 23, 2024

BREAKING – లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20మందికి గాయాలు..

పులివెందుల, అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ) : కదిరి నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సు పులివెందుల డంపింగ్ యార్డ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించపోయి 20అడుగుల లోయలో పడిపోవడంతో 20మందికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు… కదిరి నుంచి పులివెందులకు వస్తున్న ఏపీ 39 యు ఎఫ్ 91 91 నెంబర్ గల పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు పులివెందుల డంపింగ్ యార్డ్ సమీపంలోకి రాగానే పులివెందుల నుంచి కదిరి వైపు వెళ్తున్న లారీని తప్పించపోయి అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో దాదాపు 20అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడడంతో 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించి గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స అనంతరం థామస్ రెడ్డి, మరో మహిళను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.

- Advertisement -

20 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకుంటున్న డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు, ట్రాఫిక్ సీఐ హజీ వల్లి లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement