Thursday, September 19, 2024

Breaking News – చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం .. ఎనిమిది మంది దుర్మరణం

చిత్తూరు, సెప్టెంబరు 13 (ప్రభ న్యూస్ బ్యూరో) చిత్తూరు పలమనేరు రోడ్డులోని మొగిలి ఘాటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చిత్తూరు, పలమనేరు, బంగారు పాళ్యం ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. బంగారుపాలెం మండలం పరిధిలోని మొగలి ఘాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రెండు లారీల మధ్య వస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న అలిపిరి డిపో బస్సు ప్రమాదానికి గురయ్యింది. కమ్మిల లోడ్డుతో వెళ్తున్న ముందు లారీ, వెనుక బస్సు, ఆ తర్వాత లారీ చిత్తూరు వైపుగా వస్తుండగా ప్రమాదం జరిగింది.

- Advertisement -


వెనుక నుంచి లారీ వేగంగా వస్తూ బస్సును ఢీ కొనడంతో బస్సు కమ్మిల లారీని ఢీ కొంది. దీంతో బస్సులో ఉన్న వారికి తీవ్ర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా లారీలోని ట్రాలీ, కమ్మిలు పక్కకు ఎగిరిపడ్డాయి. విషయం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు, స్థానికులు, 108 సిబ్బంది చేరుకున్నారు.

వేగవంతంగా సహాయక చర్యలు బంగారుపాలెం, పలమనేరు, చిత్తూరు హాస్పిటల్ కు క్షతగాత్రులను తరలించారు. ఇప్పటివరకు ఏడు మంది మృతి 30 మందికి పైగా గాయాలు అయినట్లుగా స్థానికుల సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు పెరిగే సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పోలీసులు చెపుతున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ సుమిత్ర కుమార్, జిల్లా ఎస్పీ మణి కంఠ చండోలు, పూతలపట్టు ఏం ఎల్ ఏ మురళీమోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement