Monday, November 25, 2024

Breaking News – నిడమర్రులో పేలుడు అలజడి – ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇద్దరు విజయవాడ ఆసుప్రతికి తరలింపు
బందరు ఆసుపత్రిలో బాలుడికి చికిత్స

కృష్ణాజిల్లా మారుమూల ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం ప్రజల్లో కలవరం సృష్టించింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో బాణాసంచా తయారు చేస్తున్న ఇంటిలో భారీ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరు మైనరు బాలుడు. అతడి కళ్లకు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నం ఆసుపత్రిలో ఈ మైనరు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

నిడమర్రులోని ఓ ఇంట్లో బాణసంచా బాంబులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మరో ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. పేలింది బాణాసంచా సామాగ్రి కాదని, స్థానికంగా పందులను వేటాడేందుకు నాటు బాంబులను తయారు చేస్తుంటారని, ఈ రోజు మూడు నాటు బాంబులను రెడీ చేసి పందుల కోసం వెళ్తుండగా ఓ బాంబు చేజారి పేలిందని కథనం తెరమీదకు వచ్చింది. ఇంతకీ ఈ పేలుడు ఘటనకు దీపావళి బాంబులా? పందుల వేట బాంబులా? ఇదీ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్న. ఇక బందరులోనూ పెట్రోలు బంకులకు సమీపంలో బాణసంచా స్టాల్స్ కు అనుమతి ఇచ్చారని, ఇక్కడ తగు జాగ్రత్త అవసరమని జనం వేడుకొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement