Friday, November 22, 2024

Breaking: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో 11, 12 తేదీల్లో భారీ వర్షాలు

Weather Info: ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది.

క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ నెల 9, 10 తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement