తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో దర్శనం అనంతరం భక్తులు కొండ నుంచి తిరుగు పయనమవుతున్నారు. తిరుమలలో ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేసింది. శ్రీవారి మెట్టు మార్గంపై నడిచి వెళ్లే భక్తులను అనుమతించడంలేదు. పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.
Breaking : తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం.. శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు
Advertisement
తాజా వార్తలు
Advertisement