తిరుపతి, (ప్రభ న్యూస్): జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ,ఈ నేపద్యంలో ఎలాంటి ఘోర సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. ఎస్పీ వెంకటప్ప నాయుడు పోలీన్ అధిరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలకు చెట్లు రోడ్డుపై నేలకొరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగకుండా పోలీసులు క్రేన్ సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
వాగులు వంకలు వరదనీటిలో ప్రజలు చిక్కుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడం కాకుండా అక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన వాగు రహదారులను దాటేందుకు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఎవర్ని అటు వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రెవిన్యూ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో సహాయ సహకారాలు చేపడుతున్నారు.
అదేవిధంగా పోలీస్ సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రజలకు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని. తమ పరిసర ప్రాంతాల్లో ఇల్లు గోడలు కూలిపోవడం, చెట్లు నేలకొరిగడం, విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపోయి కింద పడటం లాంటివి జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరారు. ప్రజలకు ఏదైనా అత్యవసర సమాచారం వచ్చిన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలియజేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు తెలియజేశారు. (8099999977, 6309913960).
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily