Wednesday, November 20, 2024

Breaking: సోమశిలకు భారీ వరద, 11 గేట్లు ఓపెన్‌.. దిగువ‌న పెన్నాను ముంచెత్తిన జలాలు

నెల్లూరు జిల్లాలోని సోమ‌శిల జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 5.50 ల‌క్ష‌ల క్యూసెక్కులు నీరు వ‌స్తోంది. జలాశయంలోని 11 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ‌న ఉన్న పెన్నా నదికి విడుదల చేస్తున్నారు అధికారులు. కాగా, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అయితే ఇప్పటికే పలు గ్రామాల్లోకి చేరుకున్న వరద నీరు ఆయా గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల‌ను ముంచెత్తుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, పోలీసు శాఖ‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి-సోమశిల మెయిన్ రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement