Tuesday, November 26, 2024

Breaking: క‌రోనా మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆన్‌లైన్ పోర్ట‌ల్‌..

కరోనా వైరస్ కారణంగా చ‌నిపోయిన‌ వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా, సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. మొబైల్‌తోపాటు కంప్యూటర్‌లోనూ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉషారాణి చెప్పారు. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి బాధితులు మృతుడి కొవిడ్‌ నిర్థారించిన ఆర్‌టిపిసిఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ లేదా మాలిక్యులర్‌ టెస్ట్‌ రిపోర్టులలో ఏదొక డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement