Tuesday, November 19, 2024

Breaking: విరిగిపడుతున్న కొండ చరియలు.. తిరుమల ఘాట్ రోడ్లు క్లోజ్ చేసిన టీటీడీ

భారీ వర్షాల కారణంగా తిరుపతి సిటీ ఇప్ప‌టికే జ‌ల‌మయం అయ్యింది. తిరుమ‌ల‌లోనూ వ‌ర‌ద నీరు చేరి ఇబ్బందిగా మారింది. దీంతో ద‌ర్శ‌నాల‌కు కూడా బ్రేక్ ఇచ్చింది తిరుమ‌ల దేవ‌స్థానం. అయితే కొన్ని గంట‌ల ముందు ఘాట్ రోడ్ల‌ను తిరిగి ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కానీ, భారీ వ‌ర్షాల‌తో కొండ‌పై నుంచి కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతుండ‌డంతో ఘాట్ రోడ్ల‌పై ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మ‌ళ్లీ రెండు ఘాట్‌రోడ్లు మూసివేస్తున్న‌ట్టు తెలిపింది టీటీడీ.

కాగా, తిరుమల కొండపైకి భక్తులను అనుమతించని తిరుమల తిరుపతి దేవస్థానం. రెండు కనుమ దారులపై విరిగిపడిన కొండచరియల కార‌ణంగా భ‌క్తుల‌ను రావొద్ద‌ని సూచించింది. ర‌హ‌దారులు ప్రమాదకరంగా మారడంతో రెండు ఘాట్‌ రోడ్లు మూసివేస్తున్నట్టు వెల్లడించింది. రెండో ఘాట్‌ రోడ్‌లో 18చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో 2 ఘాట్‌రోడ్లను కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో కపిలతీర్థం, తిరుమల బైపాస్‌ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయి ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ స్తంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement