పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో మాట్లాడారు సీఎం జగన్. రక రకాల డ్రామాలు జరుగుతున్నాయన్నారు. తాత్కాలిక రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఇలాంటి ప్రాంతాల గురించి ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొడుతూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారి ఉద్యమం ఎవరికోసమని జగన్ నిలదీశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల అభివృద్ధి కోసమా అన్నారు. కట్టని రాజధాని గురించి ..కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. మిగిలిన ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నారన్నారు సీఎం జగన్.మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వారు ఉద్యమం చేస్తున్నారా అని అన్నారు.పెత్తందారుల సొంత అభివృద్ధికోసమే వారి ఉద్యమమని జగన్ తెలిపారు. అప్పుడు ఇప్పుడు ఒకే బడ్జెట్..అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దోచుకో,పంచుకో,తినుకో డిపిటి పథకం అమలైందన్నారు. నవరత్నాల ద్వారా రూ.1.65లక్షల కోట్లను అందించామన్నారు. పెత్తందారుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే..తమ బినామీ భూముల ప్రాంతమే రాజధానిగా ఉండాలంటారని జగన్ తెలిపారు.తాను ..తన మనుషులు మాత్రమే ఉండాలన్నదే వారి మనస్తత్వం అన్నారు.
Breaking : పెత్తం దారుల సొంత అభివృద్ధికోసమే అమరావతి రైతుల ఉద్యమం- సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement