ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇవ్వాల్టి (మంగళవారం) నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. ఈ పండుగకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 2015లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
ఇక.. బారా షహాద్ దర్గా , స్వర్ణాల చెరువు వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంది. ఆ మేరకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేశారు అధికారులు.