Friday, November 15, 2024

మళ్లీ మొదటికొచ్చిన బ్రహ్మంగారి పీఠాధిపత్యం వివాదం

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మఠం పీఠాధిపత్యంపై దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తమను బలవంతంగా ఒప్పించి పీఠాధిపత్యంపై నిర్ణయం తీసుకున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠం దక్కే విధంగా కుటుంబసభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వర స్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామియే బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఉత్తరాధికారిగా ఆయన సోదరుడు వీరభద్రస్వామి వ్యవహరిస్తారని పెద్దలు నిర్ణయించారు. వెంకటాద్రి స్వామి అనంతరం మఠాధిపతిగా మహలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement