Tuesday, November 26, 2024

Godawari | పాపికొండల టూర్‌కు బ్రేకులు.. నాలుగు అడుగులు పెరిగిన గోదావరి నీటిమట్టం

దేవీపట్నం, (అల్లూరి జిల్లా) ప్రభ న్యూస్‌: మండలంలో పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది.. ఇప్పటికే పది రోజులు పైగా బోట్లు తిరగడం లేదు.. తుఫాన్‌ ప్రభావంతో కొద్ది రోజుల ముందు పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు గోదావరి నదిలో నీటిమట్టం పెరగడంతో ఇక బోట్లు కదలని పరిస్థితి నెలకొంది.. దేవీపట్నం మండలంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుండి ప్రతిరోజు పర్యాటకులతో పాపికొండల విహారయాత్ర సాగేది. నిత్యం మూడు నాలుగు బోట్లు- వెళ్ళేవి.. శనివారం, ఆదివారం రోజుల్లో ఆరు బోట్లు లో పర్యాటకులు విహారయాత్రకు వెళ్లేవారు. అమ్మవారి ఆలయం వద్ద, గోదావరి నదిలో పర్యాటకుల సందడి ఉండేది.

వివిధ రకాల వ్యాపారస్తులు ఎంతో కొంత వ్యాపారాలు చేసుకునే వారు. పది రోజుల క్రితం ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో ఉన్నత స్థాయి అధికారులు బోట్లు- నిలిపివేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పాపికొండల వైపు బోట్లు- వెళ్లలేదని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు గోదావరి నదిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతుందని, ప్రస్తుతం నాలుగు అడుగులు పెరిగినట్లు- తెలిపారు. గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతూ ఉంటే బోట్లు- ప్రయాణించలేవని అధికారులు చెప్పారు. నీటిమట్టం మరింత పెరిగితే ఇక పాపికొండల విహారయాత్ర చాలా నెలలు ఆగిపోతుంది.. ఈ లోపు వర్షాలు వరదలు వస్తే కొద్ది నెలల పాటు- పూర్తి విరామం ఏర్పడుతుందని అధికారులు చెప్పారు. ఇప్పుడు బోట్లు- అన్ని అమ్మవారి ఆలయం సమీపంలో ఖాళీగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement