అమృతలూరు : గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దేవస్థానం పాలక మండలి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖల అధికారులు, పాలకమండలి సభ్యులతో 26న ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా, వేమూరు ఎమ్మెల్యే నాగార్జున , ఆలయ పాలకమండలి చైర్మన్ మండవ శ్రీరామమూర్తి హాజరవుతారని ఆలయ ఈవో అశోక్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement