Wednesday, November 20, 2024

AP : బ్రహ్మరథం భక్తుల మనో రథం…లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం..

శ్రీ సత్య సాయి బ్యూరో, మార్చి 30 (ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మరథోత్సవంకు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే తన రథాన్ని పంపడం జరుగుతుంది. అందుకే శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాన్ని, బ్రహ్మ రథోత్సవం అని సంబోధిస్తారు. డోలాయమానం గోవిందం మద్యస్థం మధుసూదనం.

- Advertisement -

ఉన్నత ప్రమాణాలతో తయారు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం దక్షిణ భారతదేశంలోని రెండో అతిపెద్ద రథంగా కీర్తించబడుతోంది. ముక్కోటి దేవతల సారీ బందికలై శతకోటి సూర్య ప్రకారాలు, నాలుగు వేదాలు, అనంత కోటి, నాలుగు దిక్కుల నుంచి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవానికి నేల కనబడని, జనసంద్రంతో అత్యంత వైభవంగా రథోత్సవం సాగుతుంది. అందుకే అంటారు బ్రహ్మరథం భక్తుల మనోరథం.
బ్రహ్మ రథోత్సవంలో శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనం ఇవ్వడం మోక్షమునకు సోపాన మార్గమని, భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన దవనం, (మంచి గుబాలింపు వాసన కలది) మిరియాలు భక్తులు సమర్పించి, తిరిగి వాటిని ప్రసాదంగా తీసుకొని, తమ మానసిక, శారీరిక రుగ్మతలను పోగొట్టుకునేకి మహాభాగ్యం భావించి వాటిని పొందడం జరుగుతుంది. ముఖ్యంగా తేరు పండగ రథం వెళ్లిన అనంతరం మిరియాల కోసం భక్తులు పెద్ద ఎత్తున సేకరణకు అనగా వేరుకోవడానికి రావడం ఇందుకు నిదర్శనం. ఇదే సందర్భంలో బ్రహ్మరథోత్సవానికి సేవలు చేసి, తరించి పోవడం భక్తులకు ఆనందదాయకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement