Sunday, November 17, 2024

తలకిందులవుతున్న బ్రహ్మరాత.. ఆడపిల్లలకు శాపంగా మారుతున్న స్కానింగ్ సెంట‌ర్లు

కర్నూలు, (ప్రభన్యూస్‌ బ్యూరో) : బ్రహ్మదేవుడి తలరాతను భూలోకంలో తలకిందులు చేస్తున్నారు. మగసంతానంపై మక్కువతో గర్భంలోనే ఆడ శిశువుకు సమాది కడుతున్నారు. గర్బస్థ శిశులింగ నిర్ధారణ పక్రీయ థేచ్చగా సాగుతుంది. ఇందుకోసం రూపొందించిన చట్టంను కొంతమంది వైద్యాధికారులు, సాంకేతిక సిబ్బంది తూట్లు పొడిచేస్తున్నారు. స్త్రీ శిశు, భ్రూణ హత్యలు జరగకుండా తగిన నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని అటు న్యాయస్ధానాలు, ఇటు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్న అమలు కావడం లేదు.

ముఖ్యంగా గర్భస్థ శిశులింగ నిర్ధారణ పక్రీయ నివారణ చట్టం పిఎస్‌డిటి ఆక్టు 1994ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 28 ఏళ్లు గడుస్తున్న భ్రూణ హత్యల ఘోరం పరపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భ్రూణ హత్య‌లు పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలో ఆరోగ్య యంత్రాంగం నామ మాత్రపు దాడులు చేసి లంచాలు పుచ్చుకొని ఎలాంటి జరిమానాలు శిక్ష లేకుండా చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement