కడప, ప్రభన్యూస్ : కరోనా ప్రభావంతో రెండేళ్లపాటు భక్తులు బ్రహ్మంగారి మహోత్సవాలను తిలకించ లేకపోయారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ యేడాది ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నేటి నుంచి 6 రోజుల పాటు- ఉత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మంగారిని దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు తెలంగాణ ,కర్నాటక నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు . భక్తులకుఎటువంటి ఇబ్బందులు కలగకుండా మఠము పూర్వపు పీఠాధిపతి వెంకటేశ్వర స్వామిపెద్దకుమారుడు వెంకటాద్రి, పర్సన్ ఇన్చార్జి శంకర్ బాలాజీ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్ళు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నదానం ఏర్పాట్లు- చేశారు.బ్రహ్మం గారి ఆరాధన ఉత్సవాలలో భక్తులకు ఎటు-వంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పెద్ద ఎత్తుబందోబస్తును ఏర్పాటు- చేశారు.ఈ నెల 8 ఆదివారం నుండి 13 వ తేదీ శుక్రవారం వరకు ఆరాధన గురుపూజ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.