Friday, November 22, 2024

Heat Waves | టెంపర్​ పెంచుతున్న టెంపరేచర్లు.. ఏపీలో బీపీ లేస్తోంది!

వానాకాలం సీజన్​ స్టార్ట్​ అయినా ఇంకా మండుటెండులు తగ్గలేదు. నిండు వేసవిలో ఎలా ఉంటుందో జూన్​ నెల సగం దాటుతున్నా వాతావరణం ఎండాకాలం మాదిరిగానే భగభగ మండిపోతోంది. ఏపీలో టెంపరేచర్లు టెంపర్​ పెంచుతుంటే.. ఉక్కపోత తట్టుకోలేక జనాలకు బీపీ లేస్తోంది. జూన్​ రెండో వారం వచ్చినా చినుకు జాడ లేకపోవడం, వాతావరణంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్​ ప్రజలు అల్లాడిపోతున్నారు.

నిత్యం పచ్చదనం, నీటి వనరులతో కూల్​కూల్​గా ఉండే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఇవ్వాల (ఆదివారం) భగ్గున మండిపోయింది. ఈస్ట్​లో ఇవ్వాల అత్యధికంగా 45.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 45.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు, మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్​ డిపార్ట్​మెంట్​ సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement