(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఏపీలో స్విగ్గి సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గత ఒప్పందాలకు భిన్నంగా జొమాటో స్విగ్గిలు పెద్ద ఎత్తున కమిషన్లు వచ్చి వసూలు చేయడంతో పాటు ఆఫర్లు డిస్కౌంట్ ల పేరుతో హోటల్ ఆదాయానికి గండి కొడుతున్నాయని అధ్యక్షుడు, ఆర్ వి స్వామి ఎం నాగరాజు లు ఆరోపించారు.
హోటల్స్ తో సంబంధం లేకుండా బై వన్ గెట్ వన్ అంటే ఆఫర్లు ఇవ్వడంతో ఆ భారం హోటళ్లపై పడి, ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్విగ్గి వైఖరి కారణంగా ఏపీలో రెస్టారెంట్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుందని ఆరోపించారు. స్విగ్గి జమోటో వైఖరులను నిరసిస్తూ విజయవాడలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి, నాగరాజు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన స్విగ్గి జమోటాలు మొదట్లో రెస్టారెంట్లకు జీరో కమిషన్ ఫీజుతో పని చేశాయని తర్వాత కాలక్రమమైన ఈ కమిషన్ 30% వరకు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్ యాజమాన్యాలకు తెలియకుండా డిస్కౌంట్లను ఆఫర్లను వర్తింపచేసి ఆదాయాన్ని నుండి తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో ఈ ఆఫర్లు వినియోగదారులు నమ్మేలా రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయన్నారు. మెనూలో కూడా యాజమాన్యానికి తెలియకుండా తరచూ మార్పులు చేస్తూ ధరలను తగ్గించి వస్తువులను విక్రయించే స్థితికి వచ్చాయన్నారు. ఇందులో బై వన్ గెట్ వన్ వంటి ఆఫర్లు ఒప్పందాలు అనుమతులు లేకుండా సృష్టించినవేనని రెస్టారెంట్ ఆదాయంపై ఇవి ప్రభావితం చూపుతున్నాయన్నారు.
ఒక ఆర్డర్ రెస్టారెంట్ సిద్ధం చేసినప్పటికీ కస్టమర్ దానిని రద్దు చేస్తే, ఇటు కస్టమర్ కి అటు రెస్టారెంట్ కి వాపస్ ఇవ్వడం లేదన్నారు. దీంతో రెస్టారెంట్లు ఆహారాన్ని తయారు చేసే ఖర్చు భరించి నష్టాన్ని కలిగిస్తుంది అన్నారు. ప్రచారాల కోసం రెస్టారెంట్ యజమానుల నుండి ప్రమోషన్ చార్జీల పేరుతో మెనూ ధరలో 15% వరకు లాక్కుంటున్నాయన్నారు.
ఇది యాజమాన్యాలపై ఘననీయమైన ఆర్థిక భారానికి దారితీస్తోందన్నారు. తరచూ జొమోటో జగ్గీలు ప్రతి ఆర్డర్ పై ఇస్తున్న 120 వరకు తగ్గింపు అది యజమానులు భరించాల్సి వస్తుందన్నారు. ఈ రెండు సమస్యలు అధిక కమిషన్ వసూలు చేయడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ పై కూడా కమిషన్ తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది మాత్రమూ చట్టవిరుద్దమని, అనైతికమనే ఆరోపించారు.
ఈ రెండు సంస్థల వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెస్టారెంట్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తగిలిన నేపథ్యంలో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరగడం జరిగిందని, ఇందులో జొమోటో సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ స్విగ్గి మాత్రం సమస్యల పరిష్కారానికి నిరాకరించిన నేపథ్యంలో అక్టోబర్ 14 నుండి ఆంధ్రప్రదేశ్లో బాయికాట్ స్విగ్గిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.