Friday, November 22, 2024

Botsa – మండ‌లిలో ప్ర‌జ‌ల గొంతుక‌ను వినిపిస్తా..

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స.
ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే నా ధ్యేయం
రాష్ట్రంలో కొన‌సాగుతున్న ద‌మ‌న‌కాండ‌ను ఎత్తి చూపుతా
ఎన్ని కేసులు పెట్టిన భ‌య‌ప‌డేది లేదు..
త‌ప్పు చేస్తే ఎవ‌రికైనా శిక్ష ప‌డాల్సిందే…
ఇక మండ‌లి విప‌క్ష నేత‌గా బొత్స‌
ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న లేళ్ల అప్పిరెడ్డి

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తన చాంబర్‌లో బొత్సతో నేడు ప్రమాణం చేయించారు. కాగా ఇక బొత్స మండ‌లిలో విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు విపక్ష నేత‌గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు..


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. శాసనసభ, శాసన మండలి లో ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చెయ్యాలి. మేము ప్రజల గొంతుక గా సభలో వ్యవహరిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపాం. రాష్ట్రంలో జరుగుతున్న దమన కాండ ను దేశానికి చాటి చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. కేసులు పెడుతున్నారు..పెట్టుకొనివ్వండి. ప్రభుత్వం లో వాళ్లే ఉన్నారు కదా. విచారణలు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం” అని అన్నారాయన.

- Advertisement -

అంతకు ముందు.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు. జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement