Thursday, December 12, 2024

AP | చంద్రబాబు, పవన్ కు థ్యాంక్స్ చెప్పిన బొత్స

ఎంవీపీ కాలనీ, డిసెంబర్ 9 (ఆంధ్రప్రభ): వైసీపీ హయాంలో నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని కూటమి నాయకులు మరోసారి ప్రజలకు చూపించార‌ని, అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. బీచ్ రోడ్డులో గల బొత్స క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేద‌ని సూచించారు. ధాన్యం కొనుగోలుపై నాదెండ్ల మనోహర్ పరుచూరి బ్రదర్స్‌లా మాట్లాడటం సరికాదని, వాస్తవాలు మాట్లాడాలి అంటూ హిత‌వు ప‌లికారు.

కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. వర్షాలు కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు చార్జీలు పెంచి, ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపిందని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

- Advertisement -

పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదీన ఎస్‌ఈలకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని, ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారని, వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషమన్నారు. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాస్తానని, లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా అని అన్నారు. టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలని, ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాల‌ని బొత్స కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement