ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ బుక్ ఎగ్జిబిషన్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుస్తక ప్రదర్శన ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… తన జీవితంలో నిలబడే ధైర్యాన్ని పుస్తకాలు ఇచ్చాయన్నారు. అలాంటి పుస్తకాలను తన సంపదగా భావిస్తానని.. తన వద్ద ఉన్న పుస్తకాలను ఎవరికైనా ఇవ్వాలంటే ఆలోచిస్తానని.. తన జీవితంలో పుస్తకాలు లేకుంటే ఏమై ఉండేదో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా.. కానీ నా వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వను. పుస్తకాలు అంటే ప్రాణం నున్న ఈ స్థాయిలో నిలబెట్టింది పుస్తకలే అన్నారు. అలాగే రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయని అన్నారు.
చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా కృష్ణారావు రాసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.