Monday, November 18, 2024

Maha Sakthi Scheme | ఈనెల 24 నుంచే బుకింగ్స్ : సీఎం చంద్ర‌బాబు

రాష్ట్ర‌ మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి పండుగ సంద‌ర్భంగా ఈ నెల 31 నుంచి.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. ఈరోజు (సోమవారం) వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా.. ఈ నెల 24 నుంచి బుకింగ్ ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని చంద్ర‌బాబు చెప్పారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తింపచేయాలని స్పష్టం చేశారు. కాగా, పథకం అమలు, విధి విధానాలపై సమీక్షించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుందని.. ఐదేళ్లకు రూ.13,423 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement