Saturday, January 11, 2025

Vijayawada | ప‌వ‌న్ కోసం తెరుచుకున్న బుక్ స్టాల్స్…

  • పుస్త‌క మ‌హోత్స‌వంలో ఉప ముఖ్య‌మంత్రి
  • త‌న కోసం రెండు గంట‌లు స్టాల్స్ తెర‌వాల‌న్న జ‌న‌సేనాని
  • అవ‌స‌ర‌మైన పుస్త‌కాలు కొనుగోలు


విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 2వ తేదీన విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రేపటితో ఈ పుస్తక మహోత్సవం ముగియనుండగా ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్న విషయం విదితమే.

కాగా, ఈరోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఉదయం 2గంటల పాటు పవన్ కల్యాణ్‌ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు. దీంతో, కేవలం పవన్ కల్యాణ్‌ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు. పవన్‌ కల్యాణ్‌ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా కొనుగోలు చేశారు.

కల్యాణి పబ్లికేషన్స్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్‌ కల్యాణ్‌.. చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు.. ఇక, ఆ తర్వాత కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement