మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇవ్వాల రాత్రి బొజ్జల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొజ్జల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గోపాలకృష్ణారెడ్డి ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత అని కొనియాడారు. అంతేకాకుండా మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మృతి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తీరని లోటుగా ఉంటుందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్న మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు. కాగా, మంత్రి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement