Thursday, November 21, 2024

AP: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తో బొజ్జా భేటి..

రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించి, వాటిని ప్రభుత్వం ముందుంచి పరిష్కార దిశగా అడుగులు వేసే దిశలో భాగంగా న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తమ గృహానికి విచ్చేసినందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.‌ నిరంతరం రాయలసీమ అంశాలపై పోరాడుతున్న బొజ్జా దశరథ రామిరెడ్డిపై గౌరవంతో, వారి కుటుంబంపై ఉన్న గౌరవంతో బొజ్జా ఇంటికి తాను స్వయంగా వచ్చానని ప్రకటించడం వారి సంస్కారాన్ని ప్రతిబింబిస్తుందని సమితి సభ్యులు కొనియాడారు.‌

రాయలసీమ సాగునీటి రంగానికి సంబంధించిన అనేక అంశాలను, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిరక్షణకు సంబంధించిన అంశాన్ని, కర్నూలు జిల్లాను సీడ్ హబ్ గా మార్చే విషయాన్ని గౌరవం మంత్రి దృష్టికి బొజ్జా తీసుకొనివచ్చారు.‌ ఈ అంశాలపై స్పందిస్తూ… నంద్యాల పరిశోధన స్థానం నుండి తాత్కాలిక కలెక్టరేట్ ను తరలించి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు‌‌. జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, రైతు ప్రతినిధులతో చర్చించి రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం ముందుంచుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తో రాయలసీమ‌ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై రైతు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement