Saturday, November 23, 2024

AP | సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌… చికిత్సపొందుతూ ఇద్దరు మృతి

ఎన్టీఆర్ జిల్లా బోడవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కూలీలతో పాటు మరో 10 మంది స్థానికులు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, బాయిలర్ పేలుడులో 20 మంది కార్మికులు గాయపడ్డారు.

వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ వెంకటేశ్‌, అర్జున్‌ అనే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement