Wednesday, November 20, 2024

Bogus Votes – ఢిల్లీలో ఇక దొంగ ఓట్ల పంచాయితీ… 28న‌ చంద్ర‌బాబు, వైసిపి ఎంపీల ఛ‌లో హ‌స్తిన యాత్ర‌..

అమరావతి, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బోగస్‌ ఓట్ల బాగోతం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది.. స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ప్రక్షాళన చేస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నకిలీ ఓట్లయుద్ధం తారాస్థాయికి చేరింది.. ఈనెల 28వ తేదీన ఢిల్లిdలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అప్రమత్త మయ్యాయి. బోగస్‌.. నకిలీ ఓట్లు జాబితాలో సాక్షాత్కరిస్తు న్నాయి.. అయితే బోగస్‌ ఓట్లపై ముందుగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే దృష్టిపెట్టింది.. గత కొద్ది నెలల క్రితం గడప- గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్వయంగా ఎమ్మెల్యేల ను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షలకు పైగా బోగస్‌ ఓట్లు గుర్తించినట్లు తనకు నివేదిక అందిందని అధికార పార్టీ ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తరువాత ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమావేశంలో బోగస్‌ ఓట్లను గుర్తించి ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేయాలని పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. దీంతో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఉపక్రమించింది.

ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేసింది. బూత్‌ లెవల్‌ అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీన సమీకృత ముసాయిదా జాబితాను ప్రకటించటంతో పాటు వాటిపై నవంబ ర్‌ 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితాను విడుదల చేసేందుకు షెడ్యూూల్‌ ప్రకటించింది. అయితే గత కొద్దిరోజులుగా వలంటీర్లకు రెండేసి చొప్పున ఓట్లు ఉన్నాయని, అధికార పార్టీ తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిలు టీడీపీ ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళనకు దిగుతున్నారు. అనంతపురం జిల్లాలో అవకతవకలకు కారణమైన ఇరువురు అధికారులపై ఈసీ సస్పెన్షన్‌కు సిఫార్సు చేయటంతో రాష్ట్రం మొత్తంగా ఒక్కో నియోజకవర్గంలో 15 వేల వరకు బోగస్‌ ఓట్లు చేరాయని వాటిని తొలగించలేదని టీడీపీ అధికారులకు ఫిర్యాదులు చేస్తోంది.

బోగస్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు రానున్న ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు.. ఎన్డీయేలో భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు ప్రతిపక్షనేత చంద్ర బాబునాయుడు ఈనెల 28వ తేదీన ఢిల్లిd పర్యటనకు సిద్ధమైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం హయాంలోనే బోగస్‌ ఓట్ల బాగోతానికి తెరలేచిందని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు అదే రోజు ప్రధాని మోడీ, అమిత్‌షాలను కలిసి వివరించాలని నిర్ణయించారు. దీంతో బోగస్‌ ఓట్ల బాగోతం ఢిల్లిdకి చేరనుంది. చంద్రబాబుకు ముందు అటు ఇటు ఈసీని క లవటంతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సేవా మిత్ర యాప్‌ ద్వారా ఓటర్ల సమాచారం సేకరణ, హైదరాబాద్‌ వేదికగా బట్టబయలైన వైనాన్ని గుర్తుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్కో ఇంటికీ ఏయే దినపత్రికలు వస్తున్నాయి.. ఏ పార్టీకి చెందిన వారో సేవామిత్ర ద్వారా గుర్తించిందని అధికారం కోసం సుమారు 50 లక్షల ఓట్లు తొలగించడం ఈ వ్యవహారం ఢిల్లి లో ఈసీకి చేరటం వరకు మరోసారి కేంద్రంతో పాటు ఎన్నికల సంఘం, దేశ ప్రజలకు వివరించే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజధాని పేరుతో సింగపూర్‌, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు కూడా టీడీపీ ఓట్లు చేర్చిందనే అభియోగాలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ రకంగా ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే పాతిక వేల ఓట్ల వరకు చేర్చారని వైసీపీ గత సార్వత్రిక ఎన్నికల కు ముందు ఫిర్యాదు చేసింది. అప్పుడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే బోగస్‌ ఓట్ల డ్రామా ఆడుతోందనేది వైసీపీ ఆరోపణ. అధికార పార్టీ వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీయటంతో పాటు జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం చేసేందుకే చంద్రబాబు ఢిల్లిd పర్యటన చేస్తున్నారని ఆక్షేపిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement