Friday, November 22, 2024

ప్రైవేట్‌ విద్యార్థులకు హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాలని బోర్డు నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రైవేట్‌ విద్యార్థుల(వితవుట్‌ కాలేజ్‌ స్టడీ, హ్యుమానిటీస్‌ మాత్రమే)కు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాలని బోర్డు సూచించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1300 హాజరు మినహాయింపు కోసం చెల్లించాలని పేర్కొంది.

ఈ నెల 29 వరకు ఇందుకోసం గడువు ఉన్నట్లు బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు స్పష్టం చేశారు. ఎటువంటి ఆలస్య రుసుముతో కానీ తత్కాల్‌ స్కీములో కానీ ఫీజు స్వీకరించడం ఉండబోదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement